బెజవాడకు దళపతి ఎంట్రీ.. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్!

తమిళనాడు సీఎం విజయ్ త్వరలో విజయవాడకు రానున్నారు. దసరా నవరాత్రుల్లో ఒక రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అదే రోజు పున్నమిఘాట్‌లో జరిగే విజయవాడ ఉత్సవ్‌లోనూ పాల్గొననున్నారు. అమ్మవారిని ఏ అలంకారంలో దర్శించుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విజయ్ రాకతో బెజవాడలో సందడి నెలకొననుంది. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సోషల్ మీడియాలో గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. దళపతి రాక కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



