← Back to news

దృశ్యం-3 సినిమా చూసి.. తండ్రి హత్యకు ప్లాన్

By A.Ajay· 5 Oct 2026
దృశ్యం-3 సినిమా చూసి.. తండ్రి హత్యకు ప్లాన్

బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో తండ్రి హత్య కేసులో కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు. సూరత్‌లో ఉంటున్న 26 ఏళ్ల శివ్‌శంకర్‌ ‘దృశ్యం-3’ సినిమా చూసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జూలై 26న సూరత్‌ నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి గ్రామానికి చేరుకున్న అతడు తండ్రి రఘువీర్‌ సాహ్నీని హత్య చేసాడు. ఫోన్‌ను స్విచ్‌ఆఫ్‌ చేసినా, తిరుగు ప్రయాణంలో పటోరి స్టేషన్‌ వద్ద భార్యకు ఫోన్‌ చేయడంతో ఆధారం లభించింది. దీంతో అక్టోబర్‌ 1న అరెస్టు చేశారు.

More in Crime