నవరాత్రి వేళ విషాదం.. 12 మంది మృతి!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈరోజు ఉదయం షీత్లా మాతా ఆలయానికి వెళ్తున్న భక్తులపైకి ఓ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. నవరాత్రి వేళ భారీ వాహనాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ ట్రక్కు అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి 50 వేల చొప్పున సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.


