← Back to news

ఒక్కసారిగా మంటలు.. కాలిపోయిన కారు

By Prashanth· 1d ago

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా నేరెడ్‌మెట్‌ పరిధిలోని RK పురం ఫ్లైఓవర్‌పై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. కాసేపటికే మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయినది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

More in Crime