← Back to news

బర్త్‌డేకి బైక్ కొనాలని.. స్నేహితుణ్ని చంపిన మైనర్లు

By Vishi· 2d ago· Ndtv
బర్త్‌డేకి బైక్ కొనాలని.. స్నేహితుణ్ని చంపిన మైనర్లు

మహారాష్ట్రలోని థానేలో స్నేహితుణ్ని చంపారు మైనర్లు. అందుకు కారణం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. పుట్టినరోజు సందర్భంగా కొత్త బైక్ కొనుగోలు చేయడానికి డబ్బు కావాలని ఇద్దరు మైనర్ అబ్బాయిలకు ఆశ పుట్టింది. తమ స్నేహితుడైన 17 ఏళ్ల ప్రజ్యోత్ కాంబ్లే మెడలో బంగారు గొలుసు గుర్తొచ్చింది. ‘దృశ్యం’ సినిమాను ఊహించుకొని, అతణ్ని చంపేసి అతని ఫోన్‌ను రైల్లో వేయాలని అనుకున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.

More in Crime