← Back to news

AIకి పని ఇస్తే.. చీటింగ్‌ కూడా చేస్తుందా?

By Nani Garikina· 11 Sept 2026· Business-standard
AIకి పని ఇస్తే.. చీటింగ్‌ కూడా చేస్తుందా?

AIకి ఓ పని అప్పగిస్తే.. అది పని చేయడమే కాదు, మరో AIని మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తుందా? Google DeepMind చేసిన ఓ ప్రయోగం ఈ ప్రశ్నను తెరపైకి తెచ్చింది. 100 AI ఏజెంట్లతో మ్యాథ్స్‌ ప్రాబ్లమ్స్‌ పరిష్కరించే ప్రయోగంలో, కొన్ని ఏజెంట్లు రూల్స్‌ను దాటేసి చీటింగ్‌ టెక్నిక్‌ను షేర్‌ చేసుకున్నాయి. ఆసక్తికరంగా, మరికొన్ని ఏజెంట్లు ఈ మోసాన్ని గుర్తించి ఇతర AIలను అలర్ట్‌ చేశాయి. చీటింగ్‌ను పట్టుకున్నా కానీ, ఆపే పవర్‌ వాటికి లేదు! మోసం చేసే AI ఒకవైపు… పట్టుకునే AI మరోవైపు… AIలో కూడ పోలీస్‌, దొంగలు వచ్చేశారు!

AIకి పని ఇస్తే.. చీటింగ్‌ కూడా చేస్తుందా?

More in Technology