ఒకటి కంటే ఎక్కువ Credit కార్డులున్నాయా?

మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే కొన్ని లాభాలతో పాటు రిస్కులు కూడా ఉన్నాయి. వేర్వేరు కార్డులతో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు పొందొచ్చు. కానీ ప్రతి కార్డుకు బిల్లు టైమ్‌కు కట్టకపోతే భారీ ఇంట్రెస్ట్ పడటంతో పాటు క్రెడిట్ స్కోర్ కూడా తగ్గొచ్చు. కొన్ని కార్డులకు యాన్యువల్ ఫీజులు ఉంటాయి. కాబట్టి అవసరానికి మించి ఖర్చు చేయకుండా, అన్ని కార్డుల బిల్లులను డ్యూ డేట్‌లోపు పేమెంట్ చేయడం ముఖ్యం. లేదంటే అప్పుల భారం పెరిగే ఛాన్స్ ఉంది.



