← Back to news

గీతం యూనివర్సిటీలో కొత్తగా BED కోర్సులు

By డీకే· 18 Jun 2026· Ntnews· సంగారెడ్డి జిల్లా
గీతం యూనివర్సిటీలో కొత్తగా BED కోర్సులు

TG: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో కొత్తగా నాలుగేండ్ల BED కోర్సులు రెండు ప్రవేశపెట్టినట్టు అదనపు VC ప్రొఫెసర్‌ DS రావు వెల్లడించారు. తమ వర్సిటీలో BA BED, BSC BED కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కోర్సుల నిర్వహణకు వర్సిటీలో కొత్తగా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను స్థాపించామని పేర్కొన్నారు. గీతం అడ్మిషన్‌ టెస్ట్‌(GAT) 2026 పరీక్షను ఈ నెల 28న ఆన్‌లైన్‌లో జాతీయంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

More in Education