భోగాపురంలో సమస్యేంటి?

భోగాపురంలో రిలయన్స్ AI డేటా సెంటర్ని దాదాపు 9 గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన G.Oకి వ్యతిరేకంగా హైకోర్టులో 43 మంది రైతులు కేసు వేశారు. తమ వ్యవసాయ భూములు.. పూర్వీకుల నుంచి ఉన్నాయనీ, వాటిని ఇస్తే, తమకు ఉపాధి, భవిష్యత్తు లేకుండా పోతుందని రైతులు <a href="https://www.theclearcutnews.com/n/AMWGMCD">ఆవేదన వ్యక్తంచేస్తున్నారు</a>. MRO, జిల్లా కలెక్టర్ తమకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు. కలెక్టర్ మాత్రం “ఎక్కువ మంది రైతులు సహకరిస్తున్నారు, కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు” అంటున్నారు. రైతుల ఇష్టంతోనే సేకరణ జరపాల్సి ఉంటుంది.



