ఈరోజు సద్దుల బతుకమ్మ

తెలంగాణలో నేడు సద్దుల బతుకమ్మ. తొమ్మిదవ, చివరి రోజైన నేడు పెద్ద బతుకమ్మను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగురంగుల తంగేడు, గునుగు పూలతో బతుకమ్మలను అందంగా అలంకరిస్తున్నారు. గౌరమ్మకు మలీద ముద్దలు, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. ఆడపడుచులు అందరూ రాత్రి వరకు సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లతో ఆడుతారు. ఆ తర్వాత బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.


