← Back to news

అమ్మాయి పేరుతో ఫేక్ ఐడీ.. ₹38 లక్షలు స్వాహా!

By Anusha· 6 Oct 2026
అమ్మాయి పేరుతో ఫేక్ ఐడీ.. ₹38 లక్షలు స్వాహా!

TG: ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో ఫేక్ ఐడీలు పెట్టి వృద్ధులు, యువకులను టార్గెట్ చేస్తున్న 26 ఏళ్ల యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత అశ్లీల కేసు పెడతానంటూ బెదిరించి, పోలీసుల పేరుతో భయపెట్టి ఏకంగా ₹38 లక్షలు వసూలు చేశాడు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, చాట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

More in Crime