CM విజయ్ పైకి దూసుకొచ్చాడు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. ఆయన కాన్వాయ్ పైకి ఓ వ్యక్తి అకస్మాత్తుగా దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం కాసేపు ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. ప్రజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



