ప్రశ్న రావణ్ పై UAPA చట్టం వర్తించదు: ABV

ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టుపై Ex IPS ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రిమాండ్ రిపోర్టుతో పాటు రావణ్ అరెస్టుకు కారణమైన వీడియో క్లిప్స్ అన్నీ చూశానని చెప్పారు. రాధామనోహర్ దాస్ అనే వ్యక్తి వేరే మతంపై చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గానే రావణ్ మాట్లాడారని, అంతేకానీ ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. రావణ్ కొన్ని బూతులు మాట్లాడిన మాట నిజమే అయినా.. అవి కేవలం ఆ వ్యక్తిని ఉద్దేశించి అన్నవే తప్ప, వాటికి ఎలాంటి ఉగ్రవాద వ్యతిరేక చట్టం (UAPA) వర్తించదని, అసలు ఈ కేసులకు ఆ చట్టానికి సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు.



