← Back to news

పర్యాటకులకు అరకు పైనరీలో సరికొత్త ఆకర్షణలు!

By B V Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పైనరీలో పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. పైన్ చెట్ల మధ్య విలువిద్య (ఆర్చరీ), మట్టి కుండల తయారీ (పోటరీ) శిక్షణను ఆదివారం ప్రారంభించింది. ప్రకృతి ఒడిలో వినోదంతో పాటు కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు FRO బొర్రా కోటేశ్వరరావు, పైనరీ ఇన్‌చార్జి శేఖర్ తెలిపారు. ఈ సదుపాయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

More in Local