నేహా కామెంట్స్పై దీప్కే క్లారిటీ

CEC జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. తమ నిరసనను (ప్రభుత్వ మార్పు) “regime change” కోసం చేస్తున్న పోరాటంగా చూడటం సరికాదన్నారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, AISA ప్రెసిడెంట్ నేహా బోరా చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలిపారు. ప్రభుత్వాన్ని మార్చడం తమ లక్ష్యం కాదని, నిష్పక్షపాతంగా వ్యవహరించే కొత్త CECని నియమించాలన్నదే తమ డిమాండ్ అని ఆయన అన్నారు.


