← Back to news

బీరోలు గ్రామపంచాయతీలో ఘనంగా బతుకమ్మ

By Y. Srinivasarao· 1h ago· Khammam
బీరోలు గ్రామపంచాయతీలో ఘనంగా బతుకమ్మ

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్పంచ్ గుమ్మడి దేవబిక్షం, పాలకమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, గ్రామ పెద్దలు, యువతీ యువకులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

బీరోలు గ్రామపంచాయతీలో ఘనంగా బతుకమ్మ

More in Local