AIకి డబుల్ సెక్యూరిటీ.. NVIDIA

AI ఏజెంట్లు అదుపుతప్పకుండా NVIDIA కొత్త డబుల్-లేయర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో రెండు ఓపెన్‌సోర్స్ టూల్స్ ఉన్నాయి. మొదటిది ‘ఓపెన్‌షెల్’.. AI ఏజెంట్లు ఏ డేటాను యాక్సెస్ చేయాలో రూల్స్ సెట్ చేసి రియల్‌టైమ్‌లో మానిటర్ చేస్తుంది. రెండోది ‘NVIDIA Sentry’.. AI కార్యకలాపాలను 24/7 పర్యవేక్షిస్తూ అనుమానాస్పద యాక్టివిటీ లేదా రూల్స్ వైలేషన్ కనిపిస్తే మిల్లీసెకన్లలో ఏజెంట్‌ను క్వారంటైన్ చేస్తుంది. AI గ్రోత్‌కు బ్రేక్ వేయకుండా సేఫ్టీని మరింత పెంచడమే ఈ షీల్డ్ లక్ష్యమని NVIDIA తెలిపింది.



