హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి గుడ్‌బై..

ఇండియన్ ఉమన్ క్రికెట్ జట్టు టీం హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. BCCI రివ్యూ మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. అయితే ప్లేయర్ గా భారత జట్టులో కొనసాగుతానని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు. కెప్టెన్సీ బాధ్యతలు ముగిసినా, జట్టు విజయాల కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇకపై కొత్త కెప్టెన్ నేతృత్వంలో టీం మూడు ఫార్మాట్లలో కొనసాగనుంది. కొత్త కెప్టెన్‌పై BCCI అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.



