← Back to news

ఇంటి భోజనానికీ ప్రైస్ షాక్‌!

By Anusha· 9 Oct 2026
ఇంటి భోజనానికీ ప్రైస్ షాక్‌!

ఇంటి భోజనం ఖర్చు కూడా పెరుగుతోంది. క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం, గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో శాఖాహార భోజనం ఖర్చు 10% పెరిగి ₹30కి చేరింది. మాంసాహార భోజనం ఖర్చు 6% పెరిగి ₹59కి చేరింది. ఆగస్టుతో పోలిస్తే ఈ ఖర్చులు 4%, 3% పెరిగాయి. ఉల్లి ధర 89% పెరిగి కిలో ₹53కు చేరింది. కుకింగ్ ఆయిల్ 12%, రైస్ 8%, LPG ప్రైసెస్ 10% పెరిగాయి. పంట తగ్గడం, కొత్త పంట ఆలస్యంగా రావడంతో పండుగల వేళ ఉల్లి ధరలు మరింత పెరగొచ్చని క్రిసిల్ రిపోర్ట్ తెలిపింది.

More in Infotainment