దసరా పండుగ వేళ సూపర్ మార్కెట్‌లో భారీ బ్లాస్ట్!

TG: దసరా పండుగ వేళ సూర్యాపేటలో భారీ పేలుడు కలకలం రేపింది. టౌన్‌లోని PSR సెంటర్‌లో ఉన్న శ్రీసాయి సూపర్ మార్కెట్‌లో గ్యాస్ లీక్ కారణంగా సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సూపర్ మార్కెట్ డ్యామేజ్ అయింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

