AP ప్రభుత్వ బోర్డులో ఉద్యోగాలు

AP ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్-8, జనరల్ మేనేజర్-17, మేనేజర్-7 పోస్టులు ఉన్నాయి. ప్రారంభంలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం ఉండగా, అభ్యర్థుల పనితీరు ఆధారంగా ప్రతిఏడాది కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం ఉంటుంది. ఆగస్టు 2, 2026 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం APEDB అధికారిక వెబ్‌సైట్‌లోని Careers విభాగాన్ని సందర్శించాలని అధికారులు సూచించారు.



