జీవిత ఖైదీల పెరోల్‌పై వివాదం

1998 కోయంబత్తూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఐదుగురికి తమిళనాడు ప్రభుత్వం 60 రోజుల పెరోల్ ఇచ్చింది. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుళ్లలో 58 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఐదుగురికి పెరోల్ ఇవ్వడంపై BJP అభ్యంతరం తెలిపింది. విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల సాఫ్ట్ సైడ్ చూపుతోందని విమర్శించింది.



