గోళ్లపై చేపల డిజైన్ల ట్రెండ్..

ఫ్యాషన్ ప్రపంచంలో రోజూ ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. లేటెస్ట్‌గా బ్యూటీ లవర్స్‌ని 'సర్డీన్ నెయిల్స్' అనే నెయిల్ ఆర్ట్ ఆకట్టుకుంటుంది. గోళ్లపై చిన్న వెండి రంగు చేపలు, నిమ్మకాయలు, ఆలీవ్ డిజైన్లను వేసుకోవడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత. మెడిటరేనియన్ సమ్మర్ ఫీల్ ఇచ్చే ఈ నెయిల్ ఆర్ట్, యూరోపియన్ స్టైల్‌ని ఇష్టపడేవారికి బాగా నచ్చేస్తుంది. నెటిజన్లు తమ గోళ్లకు ఈ చేపల డిజైన్లను వేసుకుని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.



