← Back to news

స్ట్రెస్ కంట్రోల్‌కు కొత్త మార్గం ‘ఫ్రిజ్ సిగరెట్’

By RK· 24 Jul 2026
స్ట్రెస్ కంట్రోల్‌కు  కొత్త మార్గం ‘ఫ్రిజ్ సిగరెట్’

ఒత్తిడి తగ్గించుకోవడానికి నేటితరం GEN-Z కొత్త అలవాటును ఎంచుకుంటోంది. సిగరెట్‌కు బదులుగా చల్లటి కూల్‌డ్రింక్స్ తాగి రిలీఫ్ పొందే ఈ పద్ధతిని 'ఫ్రిజ్ సిగరెట్' అంటున్నారు. మానసిక అలసట నుంచి బయటపడేందుకు మెదడు ఎంచుకునే మార్గం ఇదని నిపుణులు చెప్తున్నారు. అయితే తరచూ తాగుతుంటే శరీరంలో షుగర్, కెమికల్స్ ఎక్కువై ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి బదులుగా కొబ్బరినీళ్లు, హెర్బల్ టీ తాగడం లేదా కొద్దిసేపు నడవడం, స్నేహితులతో మాట్లాడటం ఇంకా మంచి మార్గాలు.

More in Health