← Back to news

రైల్వే ట్రాక్‌లపై రాళ్లు.. మెట్రోలో ఎందుకు ఉండవు?

By Mahesh· 12 Oct 2026
రైల్వే ట్రాక్‌లపై రాళ్లు.. మెట్రోలో ఎందుకు ఉండవు?

రైల్వే ట్రాక్‌లపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వీటిని ట్రాక్ బ్యాలస్ట్ అంటారు. రైలు భారీ బరువుతో ప్రయాణించినా పట్టాలు కదలకుండా ఉండటం, కంపనాలు తగ్గించడం, వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఇవి హెల్ప్ అవుతాయి. కానీ మెట్రో ట్రాక్‌లపై చాలా చోట్ల రాళ్లు కనిపించవు. అక్కడ కంకరకు బదులుగా బలమైన కాంక్రీట్ పునాదిపై పట్టాలు ఏర్పాటు చేస్తారు. ఈ బ్యాలస్ట్‌లెస్ ట్రాక్ విధానం వల్ల నిర్వహణ కూడా సులభమవుతుంది. అయితే కొన్ని మెట్రో మార్గాల్లో రాళ్లు ఉంటాయి.

More in Infotainment