500 రూపాయల బ్యాగ్‌కి 8.3 లక్షల ధర..!

ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ఫెండీ తీసుకొచ్చిన హ్యాండ్‌బ్యాగ్ ధర 8లక్షల 30 వేల రూపాయలు ఉండటం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ బ్యాగ్.. గుజరాత్, రాజస్థాన్‌లో నవరాత్రి సమయంలో కనిపించే సంప్రదాయ పూసలు, అద్దాల బ్యాగ్‌లను పోలి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యాగ్‌లో 39,500 పూసలు, 475 అద్దాలు ఉండగా.. తయారీకి 138 గంటలకు పైగా టైమ్ పట్టిందని ఫెండీ తెలిపింది.
