పూరీ క్షేత్రంలో జనసంద్రం
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్రకు భక్తులు పోటెత్తారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో ఊహించని రద్దీ ఏర్పడింది. ప్రభుత్వం 13వేల మంది పోలీసులతో పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది. పూరీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో కూడా జగన్నాథ రథయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.



