SIRపై రాహుల్, ఒవైసీ పిటిషన్లు.. నేడు విచారణ

SIRలో అక్రమాలు జరిగాయంటూ ఫైల్ చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. రాహుల్ గాంధీతో పాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు, AIMIM నేత అసదుద్దీన్ ఒవైసీ ఫైల్ చేసిన పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఓటర్ల పేర్ల తొలగింపుపై ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని, ఎలక్షన్ కమిషన్ రికార్డులను పరిశీలించాలని పిటిషనర్లు కోరారు. ఢిల్లీ ప్రొటెస్ట్‌ల టైంలో పోలీసుల చర్యలు, మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగిన అంశాలపై పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించనుంది.


