ప్రాణాలిస్తాం.. భూములివ్వం!
భోగాపురం MRO ఆఫీస్‌ని రైతులు ముట్టడించారు. అక్కడ రిలయన్స్ ఏర్పాటు చెయ్యాలనుకుంటున్న డేటా సెంటర్‌కి భూములు ఇచ్చేది లేదంటూ ఆందోళన చేశారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ.. భూములు ఇచ్చేది లేదన్న రైతులు.. MRO, జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల రైతులు తరచుగా ఈ ఆందోళన చేస్తున్నారు. ₹1లక్ష 8వేల కోట్లతో రిలయన్స్ ఇక్కడ 830 ఎకరాల్ని రైతుల నుంచి సేకరించాలనుకుంటోంది. భోగాపురం-పోలిపల్లి ప్రాంతంలో గిగా-స్కేల్ AI డేటా సెంటర్ + కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్లాన్ ఉంది.



