రోడ్డుపై గుంత.. అధికారుల కళ్లకు గంతలు!
బెంగళూరులోని కంఠీరవ స్టూడియో వద్ద ORRపై ఏర్పడిన భారీ గుంత ఉంది. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఆ గుంతలోనే కూర్చుని, సోషల్ మీడియా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ రోడ్డు దుస్థితిని ప్రజలకు, అధికారులకు చూపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో BBMP, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే తారు రోడ్డు వేసి పూడ్చడానికి బదులు, రాళ్లు వేసి సరిపెట్టారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు.
