← Back to news

రోబోటిక్ సర్జరీ.. హాస్పిటల్‌పై ఆరోపణలు

By Krishna· 7 Oct 2026

TG: హైదరాబాద్‌.. లక్డీకాపూల్ లోని ఫోర్టిస్ హాస్పిటల్.. రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ లేకుండానే, ఉన్నట్లుగా ప్రచారం చేసి చీట్ చేస్తోందని దళిత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు వంశీ బాలెంల ఆరోపించారు. ఆన్‌లైన్ ప్రకటనలు చూసి వచ్చిన వెంకటలక్ష్మికి మందులిచ్చి పంపారనీ, హాస్పిటల్ యాజమాన్యమే మిషన్ లేదని చెప్పిందనీ, తనిఖీల టైంలో గ్లోబల్ హాస్పిటల్‌కి చెందిన మిషన్‌ని తెచ్చి చూపించారని ఆయన అన్నారు. దీనిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

More in TG