కదిలే రైలులో పూజలు.. రైల్వే శాఖ క్లారిటీ!

రైలులో పూజలు నిర్వహిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, దీనిపై ఉత్తర రైల్వే క్లారిటీ ఇచ్చింది. ఈ మతపరమైన కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్‌లో జరగలేదని, ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న 'సలూన్ కార్' (Saloon Car) లో జరిగిందని రైల్వే శాఖ తెలిపింది. ముంబై వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు అటాచ్ చేసిన ఈ విలాసవంతమైన కోచ్ కోసం ఒక ప్రైవేట్ పార్టీ రూ. 3,08,580 అడ్వాన్స్ చెల్లించి కమర్షియల్ బుకింగ్ చేసుకున్నట్లు అధికారులు వివరించారు.



