పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ధర్నా

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు జీవో 97ను రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. తరగతులను బహిష్కరించి కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. జీవో 97 వల్ల తమ భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వినిపించారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.



