దసరా ఊరెళ్లేవారికి ప్రత్యామ్నాయ రూట్లు

దసరా, బతుకమ్మ సెలవులతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే జనం భారీగా పెరగడంతో విజయవాడ హైవే (NH-65) పై భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. LB నగర్ నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు 46 కిలోమీటర్లు దాటేందుకు ఏకంగా 3 గంటల టైమ్ పడుతోంది. దీనికి తోడు చౌటుప్పల్ వద్ద అండర్‌పాస్ పనులు జరుగుతుండటంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని క్లియర్ చేయడానికి పోలీసులు ట్రాఫిక్‌ను వలిగొండ రూట్‌లోకి మళ్లిస్తూ, పంతంగి వద్ద ఒకేసారి 12 టోల్ బూత్‌లను ఓపెన్ చేశారు.


