రీల్స్ ఎక్కువగా చూస్తే చదువుపై ప్రభావం!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌ను ఎక్కువగా చూసే అలవాటు టీనేజర్ల చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని గుర్తించారు. చైనాలో 1,500 మందికి పైగా విద్యార్థులపై చేసిన పరిశోధనలో, చిన్న వీడియోలను ఎక్కువగా చూడటానికి, భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడం, చదువులో సమస్యలను ఎదుర్కోవడం వంటి అంశాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పిల్లలు ఫోన్ వాడే సమయాన్ని తగ్గించి, చదివేటప్పుడు నోటిఫికేషన్లు ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



