ఈ కుక్కల కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బ్రిటన్‌కు చెందిన బోర్డర్ కొల్లీ కుక్కలకు ప్రపంచ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. వీటి ధర ఏకంగా 30,000 డాలర్లు (సుమారు 25 లక్షల రూపాయలు) వరకు ఉంటుంది. గొర్రెలకు కాపరిగా, వేగంగా, ఖచ్చితంగా మేపడంలో వీటిని ఉపయోగిస్తారు. బ్రిటన్‌లోని స్కిప్టన్ మార్కెట్‌లో జరిగే వేలాలకు జపాన్, అమెరికా సహా పలు దేశాల నుంచి కొనుగోలుదారులు వస్తున్నారు. పెంపుడు జంతువులుగా కాకుండా వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే విలువైన కార్మికులుగా వీటిని చూస్తున్నారు.



