స్టూడెంట్ తలపై తబలా.. టీచర్ సస్పెండ్!
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ టీచర్ చేసిన పని వైరల్‌గా మారింది. స్కూల్‌లో ఓ స్టూడెంట్ గుండు తలపై టీచర్ తబలా వాయించారు. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ నవ్వుతుండగా, ఈ వీడియోను టీచర్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వీడియో విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో టీచర్‌పై చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేసి, ఘటనపై విచారణ మొదలుపెట్టారు. స్కూల్లో విద్యార్థులతో టీచర్లు ఎలా ప్రవర్తించాలనే అంశంపై ఈ ఘటన చర్చకు దారితీసింది.
