← Back to news

భగ్గుమంటున్న విజయవాడ

By Krishna· 1h ago

AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన 'ఛలో విజయవాడ' ఉద్ధృతంగా సాగుతోంది. పోలీసుల నిర్బంధాన్ని ఏమాత్రం లెక్కచెయ్యకుండా ఉద్యోగులు.. భారీ సంఖ్యలో విజయవాడకు తరలివస్తున్నారు. ఎటుచూసినా వారే కనిపిస్తున్నారు. బారికేడ్లను సైతం తోసుకుంటూ వస్తుండటంతో, అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా AAS, నోషనల్ ఇంక్రిమెంట్లు, మృతుల కుటుంబాలకు ప్రయోజనాలు, ప్రమోషన్ల వంటి సమస్యలు పరిష్కరించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు.

More in AP