రూ.500 కోసం విద్యార్థినులపై టీచర్ దారుణం
రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో టీచర్ దారుణంగా ప్రవర్తించింది. రూ.500 మిస్సయ్యాయనే అనుమానంతో 9, 11వ తరగతి విద్యార్థినుల బట్టలు విప్పించి చెక్ చేయించింది. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి నిరసన తెలిపారు. అధికారులు విద్యార్థినుల వాంగ్మూలాలు రికార్డు చేసి సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేశారు. మరో ఇన్‌స్ట్రక్టర్‌ను కూడా విధుల నుంచి తొలగించారు.



