కాలు విరిగితే కార్డుబోర్డుతో కట్టు.. హాస్పిటల్‌పై విమర్శలు
బిహార్‌లో గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్‌లో గాయపడి కాలు విరిగిన కృష్ణకుమార్‌కు మంజ్‌హౌల్ డివిజనల్ హాస్పిటల్లో స్టాఫ్ కార్డుబోర్డు ముక్కలను కాలికి రెండువైపులా ఉంచి, బ్యాండేజీతో కట్టారు. ఆగస్టు 3న హర్సైన్ బ్రిడ్జి దగ్గర్లో ఆటో ఢీకొనడంతో కృష్ణకుమార్‌కు గాయాలవ్వడంతో పోలీసు వెహికల్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తరువాత బెగుసరాయ్ సదర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నెటిజన్స్ హాస్పిటల్ స్టాఫ్ పనితీరుపై కామెంట్స్ చేస్తున్నారు.



