‘కొండమల్లు’ - నవల

తెలుగులో చారిత్రక నవలలు చాలా వరకూ పాఠకుల ఆదరణ పొందాయి. చక్కటి కథనంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన ‘కొండమల్లు’ నవల అలాంటిదే. పల్నాటి రాజ్యం ఏర్పడినప్పటి నుంచి, పల్నాటి యుద్ధానికి ముందు బ్రహ్మనాయుడు వనవాసానికి వెళ్లే వరకు ఈ కథ సాగుతుంది. పల్నాటి చరిత్రను ఆధారంగా చేసుకున్న నవల అయినా, ఇందులో చెంచుల జీవన విధానాన్ని రచయిత అద్భుతంగా చూపించారు. చెంచుల భాషలోనే ఆ సంభాషణలు ఉండటం మరో ప్రత్యేకత. చారిత్రక నవలలు ఇష్టపడేవాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ధర ₹300. కొనే <a href="https://amzn.in/d/0f7KO8Jc">లింక్</a>.



