దేశం విడిచి వెళ్లాలి..నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఆర్డర్స్

బాలీవుడ్ నటుడు, ఆమిర్‌ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్‌ఖాన్‌కు ముంబై పోలీసులు కీలక నోటీసులు ఇచ్చారు. ఈనెల 28లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని చెప్పారు. ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలో ఇమ్రాన్ పాల్గొనడమే ఇందుకు కారణం. నిరసన టైంలో భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. అమెరికా పాస్‌పోర్ట్ ఉన్న ఇమ్రాన్ రూల్స్‌కు విరుద్ధంగా ఆందోళనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.


