"గ్రీన్ గణేశా".. DCM పవన్ కళ్యాణ్ స్పెషల్ మెసేజ్!

AP: వినాయక చవితి సందర్భంగా.. AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారైన విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయని, మట్టి విగ్రహాలు పర్యావరణానికి మేలు చేస్తాయని తెలిపారు. పచ్చదనాన్ని కాపాడుతూ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.



