యూసీసీపై అమిత్ షా కీలక ప్రకటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2029 లోక్‌సభ ఎన్నికల్లోగా NDA పాలిత 19 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి కానుండటంతో దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజున ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ నాలుగుసార్లు CMగా, మూడుసార్లు ప్రధానమంత్రిగా గెలుపొందారు.



