← Back to news

మృతదేహాన్ని పీక్కుతింటున్నాయ్..

By Prashanth· 7 Oct 2026

TG: హైదరాబాద్ నగరంలో నాగోల్‌ పరిధిలోని తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. జనాలు లేని ప్రదేశంలో కుక్కలు పీక్కుతింటున్న స్థితిలో మృతదేహాన్ని మార్నింగ్ వాకర్స్ గుర్తించారు. మృతురాలిని OU మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా పోలీసులు గుర్తించారు. గత నెల 28న ఆమె కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదైంది. మృతదేహం ఒంటిపై దుస్తులు లేకపోవడంతో.. అత్యాచారం చేసి హత్య‌చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More in TG