దసరాకు APSRTC స్పెషల్ బస్సులు.. 5,261 సర్వీసులు!

AP: దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని APSRTC బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 25 వరకు 5,261 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు RTC అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి AP జిల్లాలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌కు 1,186, విశాఖకు 440, బెంగళూరుకు 475, చెన్నైకి 153, తిరుపతికి 247, రాజమహేంద్రవరానికి 347 స్పెషల్ బస్సులు నడపనున్నారు. ప్రయాణికులు <a href="https://www.apsrtconline.in/oprs-web/guest/home.do?h=1">APSRTC వెబ్‌సైట్</a> లేదా యాప్‌లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.



