← Back to news

ఇక్కడ ఒక టాబ్లెట్ కాస్ట్ రూ.35- అమెరికాలో 85,000

By DS· 3 Jul 2026· US
ఇక్కడ ఒక టాబ్లెట్ కాస్ట్ రూ.35- అమెరికాలో 85,000

ఇండియాలో దొరికే చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్ రేట్స్ చూసి ఒక అమెరికన్ లేడీ మైండ్ బ్లాక్ అయింది. యూఎస్‌లో తన బంధువు బ్లడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం వాడే ఒక్కో Revlimid టాబ్లెట్ కాస్ట్ $900 (దాదాపు ₹85,000) ఉంటే, అదే టాబ్లెట్ ఇండియాలో కేవలం ₹35 నుండి ₹300 (కేవలం 30 సెంట్లు) కే దొరుకుతుందని లిజ్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేసింది. "అమెరికా హెల్త్‌కేర్ సిస్టమ్ మమ్మల్ని దారుణంగా దోచేస్తోంది.. కానీ ఇండియా మాత్రం తన ప్రజలకు చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లోనే మెడిసిన్స్ అందిస్తోంది" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

More in Health