వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్

ఢిల్లీలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఒక గోల్డ్ తో సహా 5 మెడల్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్ పి.వి. సింధు, ఈసారి కూడా బరిలోకి దిగుతోంది. రీసెంట్‌గా జపాన్ టైటిల్ కూడా గెలవడంతో ఆమెపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఐర్లాండ్ ప్లేయర్ సోఫియాతో సింధు పోటీపడనుంది. ఆమెతో పాటే మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట కూడా పతకాలు సాధించాలని కోరుకుందాం.



