ముగిసిన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం
TG: ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. పంచముఖ సంకట హర మహా గణపయ్యకు ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద నిమజ్జనం పూర్తైంది. నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. బడా గణేశుడిని చివరిసారిగా చూసేందుకు భక్తులు భారీగా వచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ ఏరియా మొత్తం భక్తులతో నిండిపోయింది. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ మార్గంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. భారీగా వచ్చిన భక్తుల కోసం పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.


