4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి: వ్యక్తికి దేహశుద్ధి

నాలుగేళ్ల పాప.. అంత చిన్న పిల్లపై కూడా లైంగిక దాడి చేయబోయాడో కామాంధుడు. ఓ యువకుడు చూసి ఊరందరికీ సమాచారం ఇవ్వడంతో ఆ పాప బతికిపోయింది. కామాందుడికి దేహశుద్ధి జరిగింది. ఇప్పుడతను ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ ఘటన షాద్నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఫరూక్నగర్ మండలం, కందివనంలో జరిగింది. అఘాయిత్యానికి పాల్పడ్డ చెన్నయ్యపై పాప కుటుంబసభ్యులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణా మరో బీహార్ కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



